పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
కృష్ణా జిల్లాలోని పామర్రు శివారు యాదవపురంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాండురంగారావు అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో అతను మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు. మృతుని తల్లి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.