VIDEO: పుష్పాల వాగును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

MDK: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న మెదక్ పుష్పాల వాగును బుధవారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వరద నీటిని చూసి అవాక్కయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవరూ ఉండకూడని, అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు.