'పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి'

'పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి'

NRML: కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువులకు పశు వైద్యాధికారి విశ్వజిత్ స్వయంగా టీకాలు వేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను గ్రామంలోని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రైతులకు సూచించారు.