లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన స్పీకర్
VKB: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కోటపల్లి మండలానికి చెందిన 14 మందికి ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు.