నేడు సర్వసభ్య సమావేశం

కృష్ణా: ఉంగుటూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని స్త్రీశక్తి భవన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వి.సరోజినీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీపీ సభ్యులు, గ్రామ సర్పంచులు, ప్రత్యేక ఆహ్వానితులు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు.