ఈ నెల 31 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 31 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

PLD: మాచర్ల పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 31న అంకురార్పణ, ఏప్రిల్ 1న ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 2న స్వామివారి కళ్యాణోత్సవం, 3న హనుమద్వాహనం, 4న శేషవాహనం, 5న గరుడవాహనం, 6న రవిపొన్న వాహనం, 7న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.