పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
ELR: మండవల్లి ZP హైస్కూలులో బుధవారం 120 మంది పదవ తరగతి విద్యార్థులకు రూ.10వేలు విలువచేసే UTF ముద్రించిన మోడల్ టెస్ట్ పేపర్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. అయ్యవారి రుద్రవరం హరిజనవాడ ప్రాథమిక పాఠశాల HM, పూర్వ విద్యార్థి చిరిగిరి పిచ్చోడు ఆర్థిక సహాయంతో ఈ పంపిణీ జరిగింది. విద్యార్థులు పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.