చెరువు కట్ట తూమును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

చెరువు కట్ట తూమును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

JGL: బీర్పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామ శివారులోని గంటన్న చెరువు తూమును చానెల్ గెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. శనివారం విషయం తెల్సుకున్న గ్రామ సర్పంచ్ తొగిటి సత్తవ్వ, సురేంధర్ సంబందిత ఎస్ఆర్ఎస్పీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్ఆర్ఎస్పీ డీఈ చక్రునాయక్, ఏఈ అనీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌లు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.