భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

NGKL: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గురువారం పరిశీలించారు. సమ్మె నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.