ముస్లిం మత పెద్దలతో సమావేశమైన సీఐ
ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సీఐ మల్లికార్జున శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఎలాంటి గొడవలకు తావు లేకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 15 మసీదుల ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.