చెరువుల కబ్జాపై మంత్రికి ఫిర్యాదు

చెరువుల కబ్జాపై మంత్రికి ఫిర్యాదు

అన్నమయ్య: మదనపల్లెలో చెరువుల కబ్జాపై మంత్రి నిమ్మల రామానాయుడికి స్థానికులు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని చెరువులు, బఫర్ జోన్లు, నీటికాలువలు, నీటి ప్రవాహ మార్గాల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కోరారు. కొమ్మతివాని చెరువు, తట్టివారిపల్లి, సామిచెరువులు కబ్జాచేశారని పేర్కొన్నారు.