జిల్లాకు 1020 మెట్రిక్ టన్నుల యూరియా రాక

జిల్లాకు 1020 మెట్రిక్ టన్నుల యూరియా రాక

KMM: చింతకాని మండలం పందిళ్ళపల్లి పాయింట్ కు రైల్వే వ్యాగన్ల ద్వారా సిఐఎల్ కంపెనీ చెంద 1020.80 మెట్రిక్ టన్నుల యూరియా, 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువులు చేరినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య గురువారం తెలిపారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత భాగాన్ని బఫర్ స్టాక్‌గా నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు.