'8న కామాక్షమ్మ హుండీ లెక్కింపు'

'8న కామాక్షమ్మ హుండీ లెక్కింపు'

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షమ్మ తల్లి దేవస్థానంలో ఈనెల 8వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.