పురుషులను టార్గెట్ చేస్తూ ట్రాప్ చేస్తున్న ముఠాలు

పురుషులను టార్గెట్ చేస్తూ ట్రాప్ చేస్తున్న ముఠాలు

కామారెడ్డిలో పురుషులను టార్గెట్ చేస్తూ ట్రాప్ వేసే ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా లొంగదీసుకుని డబ్బుల కోసం బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీరి ఉచ్చులో 40 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, సిరిసిల్ల, మేడ్చల్, నాందేడ్‌లో కూడా వీరి బాధితులు ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.