BREAKING: కత్తితో మహిళలపై దాడి
CTR: చిత్తూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఒక వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. ముగ్గురు మహిళలను కత్తిలో గాయపరిచాడు. దాడికి పాల్పడిన వ్యక్తి వీ.భాస్కర్ నాయుడుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో సరస్వతి, సులోచనలు తీవ్రంగా గాయపడగా, లక్ష్మీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.