గురువు మరణం.. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
KNR: చదువు ముగియగానే గురువును మరచిపోయే ఈ కాలంలో 23 సం.క్రితం విద్యను బోధించిన తమ గురువును గుర్తించుకొని ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్నలను అందుకున్నారు. KNR లోని వింధ్యవ్యాలీ పాఠశాలలో తెలుగు బోధించిన శేషం పార్థసారథి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో 2002 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు లక్ష రూ. ఆర్థిక సహాయాన్ని అందించి మంచి మనసు చాటుకున్నారు.