హృదయవిదారక వాతావరణం
TG: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన వద్ద బాధితుల ఆర్తనాదాలతో హృదయవిదారక వాతావరణం ఏర్పడింది. మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 10మంది మహిళలు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే సహాయచర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు.