బెల్టు షాపులపై దాడులు నిర్వహించిన అధికారులు

బెల్టు షాపులపై దాడులు నిర్వహించిన అధికారులు

KDP: దువ్వూరు మండలంలోని బైనపల్లిలో శనివారం రాత్రి పోలీసులు బెల్టు షాపులపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా 13 మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు ప్రొఫెషన్ SI జగదీశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.