'ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

'ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

MBNR: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ సీఐ భగవంతు రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారుల వెంట పెద్దగా శబ్దం చేస్తూ రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు. వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.