అజిత్ దోవల్‌తో బంగ్లా NSA భేటీ

అజిత్ దోవల్‌తో బంగ్లా NSA భేటీ

బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు ఖలీలూర్ రెహ్మాన్ నిన్న న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దోవల్‌ను ఢాకా పర్యటనకు ఆహ్వానించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా పదేపదే అభ్యర్థిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్(CSC) 7వ NSAల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.