'కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు కూలీగా మారుతున్నారు'
KMM: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల చిన్న రైతులు కూలీలుగా మారుతున్నారని రైతుల హక్కుల కోసం పోరాడాలని నాయకులు అన్నారు. మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించనున్న AIPKMS రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాకుల శివలింగం పిలుపునిచ్చారు. ఆదివారం తెట్టల్పాడులో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.