హర్ముజ్‌ వద్ద చిక్కుకుపోయిన 700పైగా ట్యాంకర్లు

హర్ముజ్‌ వద్ద చిక్కుకుపోయిన 700పైగా ట్యాంకర్లు

హర్ముజ్ జలసంధి వద్ద 700లకుపైగా ట్యాంకర్లు చిక్కుకుపోయినట్లు విండ్ వార్డ్, కెప్లెర్ సంస్థలు వెల్లడించాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లినట్లు చెప్పాయి. ఈ జలసంధి నుంచి మార్చి 2న కేవలం ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ ప్రయాణించినట్లు తెలిపాయి. మొత్తం 706 ఇరానేతర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంచనా వేశాయి. వీటిలో 334 చమురు రవాణావిగా పేర్కొన్నాయి.