'మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు'
NZB : మెండోరా వివేకానంద సర్కిల్ వద్ద బుధవారం రోడ్డు భద్రతకు సంబంధించి "అరైవ్ అలైవ్" కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సుహాసిని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆమె రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ. 10 వేల జరిమానా, లేదా జైలు శిక్ష తప్పదని తెలిపారు.