VIDEO: వాకర్స్‌పై పన్ను.. సీపీఎం నిరసన
VSP: స్వర్ణభారతి స్టేడియంలో వాకర్స్‌పై పన్ను విధించిన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఎం నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. నడకపై పన్ను వేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనమని వారు విమర్శించారు. ఈ నిర్ణయం క్రీడాకారులు, సామాన్యులపై భారమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేస్తామన్నారు.