విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం

BDK: అశ్వాపురం మండలంలోని మల్లెమడుగు గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఉమా రావు పాల్గొని వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వర్షం పడుతున్నప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ లను ముట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతుల పాల్గొన్నారు.