బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని కేంద్రానికి విరాళం
TPT: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని కేంద్రానికి రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన కేయూరా ఇన్‌ఫ్రా కన్స్‌ట్రక్షన్స్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఈవో జే.శ్యామలరావును కలసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారికి ధన్యవాదాలు తెలిపారు.