VIDEO: నరసింహకొండ సన్నిధిలో ఉడుపి పీఠాధిపతులు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని బుధవారం ఉడుపి పీఠాధిపతులు ఈషాప్రియ తీర్ధ స్వామీజీ విచ్చేశారు. ముందుగా ఆలయ సిబ్బంది స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు.