నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు టీడీపీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం ప్రకటించింది. స్థానిక సమస్యలు, వ్యక్తిగత విన్నపాలను ప్రజలు దరఖాస్తు రూపంలో నేరుగా ఎమ్మెల్యేకు అందజేయవచ్చని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.