VIDEO: తాగి ఆటో నడుపుతున్న వ్యక్తిపై మంత్రి ఆగ్రహం
సత్యసాయి: పెనుకొండలో ఆటో నడుపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైవర్‌పై మంత్రి సవిత ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఆటోలో తీసుకుని ఇలా తాగి నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్డని ఆయనకు హెచ్చరించారు. మద్యం సేవించి ఆటో నడుపుతున్న అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సైకు ఆదేశాలు జారీ చేశారు.