మత్తు మందు చల్లి.. సామూహిక అత్యాచారం

మత్తు మందు చల్లి.. సామూహిక అత్యాచారం

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. సుబర్ణపూర్ జిల్లాలో జాబ్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళను ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని.. ఆమె ముఖంపై మత్తు మందు చల్లారు. అనంతరం ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత రోడ్డు పక్కకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసటి రోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.