అండర్-14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన ప్రొద్దుటూరు బాలుడు
KDP: ప్రొద్దుటూరుకు చెందిన వాల్ సాద్ ఇర్ఫాన్ అండర్-14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గుంటూరులో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకూ రాష్ట్ర SGF అండర్-14 అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఇర్ఫాన్ ప్రతిభ కనబరిచాడు. వరుసగా రెండవసారి జాతీయ జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.