కడప-బద్వేలు రహదారిలో పొంచి ఉన్న ప్రమాదం

కడప: బద్వేలు ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు పక్కన బావి ఉండడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. వాహనాలు క్రాసింగ్ అయ్యే సమయంలో బావిలో పడే అవకాశం ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బావిని పూడ్చి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.