VIDEO: రగుడు ఎల్లమ్మ ఆలయం వద్ద వాహన తనిఖీలు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని రగుడు ఎల్లమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఎస్సై దిలీప్ అధ్వర్యంలో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఎవరుకూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్సై కోరారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వేములవాడ నుంచి సిరిసిల్ల వెళ్తున్న వాహనాలు భారీగా నిలిచిపోయాయి.