భారీగా అక్రమ మద్యం ధ్వంసం

భారీగా అక్రమ మద్యం ధ్వంసం

ATP: జిల్లాలో వివిధ కేసులలో పట్టుబడిన మద్యం సీసాలను ఇవాళ ఎక్సైజ్ పోలీసు ధ్వంసం చేశారు. అనంతపురంలోని సోముల దొడ్డి గ్రామ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 474 గోవా మద్యం బాక్సులను, 73 ఇతర మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.