20 లక్షల సోలార్ రూప్ టాప్‌ల ఏర్పాటే లక్ష్యం: గొట్టిపాటి
మార్కాపురం: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూప్ టాప్‌ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం మార్కాపురం మండలం పెద్ద యాచవరంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూట్ టాప్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.