కుటుంబంతో కలిసి ఓటేసిన MLA కౌశిక్ రెడ్డి
KNR: మూడో విడత స్థానిక ఎన్నికల్లో వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి ఓటు వేశారు. ఆయన స్వగ్రామం వీణవంకలోని ఒకటో వార్డులో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి అన్నారు.