చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక వివరాలు

అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. దీనిపై అమెరికా ఎఫ్‌బీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. కిర్క్ మాట్లాడుతున్న ప్రాంతానికి 100 గజాల దూరంలో ఉన్న భవనం రూఫ్‌టాప్ నుంచే కాల్పులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆ భవనం మీద దుండగుడు దాక్కొన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.