'ఇకపై విద్యుత్ అంతరాయాలు ఉండవు'

KMM: ఏన్కూరు మండలంలోని నాచారం సబ్ స్టేషన్ పరిధిలో ఇకపై విద్యుత్ అంతరాయాలు ఉండవని ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. నాచారం సబ్ స్టేషన్‌లో 11కేవీ ఫీడర్ బ్రేకర్‌ను బుధవారం చార్జ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రేపల్లె వాడ, నాచారం ఫీడర్లు కలిసి ఉండగా, ఏదైనా సమస్య ఎదురైతే రెండు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.