స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
CTR: డ్వాక్రా మహిళలకు మరింత అత్యుత్తమమైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని 25 మంది సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.