రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి
KNR: రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాలు ఉన్న రైతులు మూడు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు.