'ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం'
KNR: హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల పరిధిలోని కనుకుల గిద్ద, వావిలాల, సీతంపేట, భోగంపాడ్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ప్రణవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పూలమాలలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రణవ్ మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు.