నేడు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు: పోలీసులు
NLR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. జయంతి ర్యాలీ నేపథ్యంలో వీఆర్సీ నుంచి గాంధీబొమ్మ వైపు వెళ్లే వాహనాలను రామలింగాపురం వైపు మళ్లించనున్నారు. అలాగే కనకమహాల్ నుంచి వీఆర్సీ వైపు వచ్చే వాహనాలను బోసుబొమ్మ, పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.