మహిళపై చిరుతపిల్లల దాడి

మహిళపై చిరుతపిల్లల దాడి

CTR: ఐరాల మండలంలోని పుత్రమద్ది గ్రామ సమీప తోటలలో అదే గ్రామానికి చెందిన కాంతమ్మపై ఇటీవల రెండు చిరుత పులి పిల్లలు దాడి చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్వో రాకేష్ కుమార్ సోమవారం పరిశీలించారు. ప్రజలు చిరుత పులుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.