రాహుల్ గాంధీ మాట నిలబడాలి: సీఎం రేవంత్

రాహుల్ గాంధీ మాట నిలబడాలి: సీఎం రేవంత్

TG: టీ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు మేలు జరగాల్సిందేనని అన్నారు. 'రాహుల్ గాంధీ మాట నిలబడాలి. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారమైతే బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు. త్వరలో కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేస్తాం. 90 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదించాలన్న అంశంపై సుప్రీంలో వాదనలకు ఇద్దరు లాయర్లను నియమించాం' అని పేర్కొన్నారు.