సీఈఐఆర్ ద్వారా 3,705 మొబైల్ ఫోన్ల రికవరీ

KMR: సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 3,705 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఆందోళన చెందకుండా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. మొబైల్ పోయిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.