'పన్ను కట్టించుకున్నారు కానీ మౌలిక సదుపాయాలు లేవు'
PLD: పెదకూరపాడు, ముసాపురం పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు గానీ, గ్రామ అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయడం లేదని స్థానిక ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సైడ్ కాలువలలో మురికి తొలగింపు చర్యలు కూడా చేయడం లేదని, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని లైట్లు సకాలంలో వేయరని వారు చెప్పుకొచ్చారు.