సంతపేటలో పర్యటించిన మేయర్

సంతపేటలో పర్యటించిన మేయర్

ప్రకాశం: ఒంగోలులోని 14వ డివిజన్ సంతపేటలో సోమవారం మేయర్ గంగాడ సుజాత పర్యటించారు. కాలువ పూడికతీత పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనంతరం స్థానికులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.