'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి '

KMM: కామేపల్లి మండల ప్రజలు ఈనెల28న ఖమ్మం కోర్టులో నిర్వహిస్తున్న నేషనల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కామేపల్లి ఎస్సై బి.సాయికుమార్ కోరారు. కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాజీ చేసుకునే ఇరు వర్గాలు ఈనెల 27వరకు పోలీసుస్టేషన్‌కు హాజరైనట్లయితే పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.