'ఆరుగాల కష్టం ఆవిరై.. రైతు కన్నీరు కార్చిన తరుణం'

MBNR: బాలానగర్ మండలం నందారం గ్రామంలో కరెంటు సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. బోరు బావులల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ, కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సక్రమంగా కరెంటు సరఫరా చేయాలని కోరారు.