'అక్రమ తవ్వకాలే విద్యార్థులు మృతికి కారణం'
కృష్ణా: చిక్కవరం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై MLA యార్లగడ్డ వెంకట్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమ తవ్వకాలే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.